దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతన్న తరుణంలో అసోంలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. దిబ్రుగఢ్, చరైడియా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నాలుగు గ్రెనేడ్లు పేలడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
దిబ్రుగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రాహమ్ బజార్, ఏటీ రోడ్లోని గురుద్వారా ముందు రెండు చోట్ల ఈ పేలుళ్లు జరిగాయి. దిబ్రుగఢ్ జిల్లాలోని దులియాజన్ ప్రాంతంలో మరో గ్రెనేడ్ పేలింది.