జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లా సోపోర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. ఈ ఘటనలో ఓ జవాను సహా సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సోపోర్‌లో తనిఖీలు చేస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై ముష్కరులు దాడులు ప్రారంభించారని ప్రకటించారు కశ్మీర్ డీజీపీ దిల్భాగ్ సింగ్. ఉగ్రవాదులు నక్కి ఉన్న ప్రాంతంలో ఆంక్షలు విధించి.. గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.