కర్ణాటక బెలగావిలో హృదయ విదారక ఘటన జరిగింది. నలుగురు బిడ్డలతో కళకళలాడుతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఒకేరోజు ముక్కుపచ్చలారని నలుగురు చిన్నారుల మృతితో ఆ ప్రాంతమంతా కన్నీటిసంద్రమైంది.
కరోనా నుంచి కాపాడుకునేందుకు...

గోకాక్ తాలూకా అజ్జనకట్టి గ్రామానికి చెందిన క్రెప్ప జక్కన్నవర, రాజశ్రీ జక్కన్నవర దంపతులకు నలుగురు సంతానం. కరోనా వ్యాప్తి నుంచి ఆ నలుగురు చిన్నారులను కాపాడుకునేందుకు కొద్దిరోజులుగా గ్రామానికి దూరంగా తమ పొలంలోనే నివాసముంటున్నారు. అక్కడ తమ బిడ్డలకు ఏ అపాయమూ కలగదని భావించారు. కానీ, విధి వారిపై కన్నెర్ర జేసింది. ఒకేసారి నలుగురు బిడ్డలను దూరం చేసింది.
మొబైల్ ఫోన్‌తో సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఫోన్ పొలంలోని ఓ నీటిమడుగులో పడిపోయింది. ఫోన్‌ను వెలికితీసే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరు ఆ నీటికుంటలోకి దిగారు చిన్నారులు. ఈ ప్రమాదంలో ఆరేళ్ల భగవవ, ఐదేళ్ల తాయమ్మ, నాలుగేళ్ల మలప్పలతోపాటు రెండేళ్ల చిన్నారి రాజశ్రీ మృతి చెందారు. గోకాక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:ఇది ఆయుధాలు వాడని యుద్ధం: రవిశంకర్