ఓ వలస కార్మికుడి కుటుంబంలో ఈత కడుపుకోతను మిగిల్చింది. నలుగురు అన్నదమ్ములు సరదాగా ఈత కోసం చెరువుకు వెళ్లి.. దురదృష్టవశాత్తూ నీళ్లలో పడి మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర- అహ్మద్‌నగర్‌లోని శ్రీగొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
నవాజిస్ సలీమ్ అహ్మద్(9), దానేశ్ సలీమ్ అహ్మద్(13), అర్బాజ్ సలీమ్ అహ్మద్(21), ఫైసల్ సలీమ్ అహ్మద్(18)లు మృతి చెందినట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో సమీర్ షేక్ అనే వ్యక్తి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.