జమ్ముకశ్మీర్ బడ్గాం జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు సహకారం అందిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిని వసీం గనీ, ఫరూఖ్ అహ్మద్ దార్, మహ్మద్ యాసిన్, అజారుద్దీన్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. పోలీసులు, భద్రతా దళాల సహకారంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
లష్కరే తోయిబాకు సహకరిస్తున్న నలుగురు అరెస్టు - LeT militants associates arrest
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్న నలుగురిని జమ్ముకశ్మీర్ బడ్గాం జిల్లాలో అరెస్టు చేశారు భద్రతా సిబ్బంది. వీరి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎల్ఈటీ ఉగ్ర సంస్థకు సహకరిస్తున్న నలుగురు అరెస్టు
లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడం, ఆశ్రయం కల్పించడం సహా ఇతర కార్యకలాపాల్లో ఈ నలుగురు సహకరిస్తున్నట్లు అధికారులు వివరించారు.