'ఆయుష్మాన్ భారత్' పేరిట నకిలీ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోన్న నలుగురు దిల్లీ యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ వెబ్సైట్ ద్వారా వేల మందిని మోసగించారని పోలీసు అధికారులు తెలిపారు. నిందితులు.. ఉమేశ్(37), రాజత్(33), గౌరవ్(26), సీమా రాణి శర్మ(33)ల నుంచి ఒక ల్యాప్‌టాప్, నాలుగు చరవాణిలు, ఎటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఎలా చేశారు..?
ఆయుష్మాన్ ఆరోగ్య పథకం కింద.. సుమారు 5,000 కొలువులు అందుబాటులో ఉన్నాయని నిందితులు తమ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చారు. ఇందులో వార్డ్బాయ్, నర్స్, ల్యాబ్ సహాయకులు, ఫార్మాసిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయని నమ్మబలికారు.
సంబంధిత పోస్టుకు అనుగుణంగా ఓ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను ఆ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ అప్లికేషన్ ఫారమ్ నింపాక.. ఆన్లైన్ పేమెంట్ కింద రూ. 300 నుంచి 500 వరకు (పోస్టును బట్టి) దరఖాస్తుదారులు చెల్లించేలా చేశారు. వీరు చేసిన ఈ మోసాలకు సుమారు 4,200 మందికి పైగా బాధితులు బలయ్యారు.