ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర పునాది పనులు జనవరిలో ప్రారంభమవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివిధ ఇంజినీరింగ్ సంస్థలు నివేదికను తయారు చేస్తున్నాయని వెల్లడించారు. సరయూ నది ప్రవాహం నుంచి ఆలయానికి రక్షణ కల్పించేలా ప్రహారీ గోడను భూఉపరితలం లోపలి నుంచి నిర్మించనున్నట్లు చెప్పారు.
జనవరి నుంచి రామ మందిర పునాది పనులు - ayodhya ram mandir foundation works starting date
అయోధ్య రామ మందిర పునాది నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఆలయ ప్రహారీ గోడను భూఉపరితలం లోపలి నుంచి నిర్మిస్తున్నట్లు తెలిపారు.
జనవరిలో అయోధ్య మందిర పునాది పనులు
మరోవైపు, మందిర నిర్మాణ అంశంపై విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నేతలు భేటీ నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు.
ఇదీ చదవండి:రామమందిర పునాది తుది నమూనా సిద్ధం