తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా రామాలయ నిర్మాణం

ramtemple
రామయ్య సేవలో భక్తజనం

By

Published : Aug 5, 2020, 9:42 AM IST

Updated : Aug 5, 2020, 2:26 PM IST

14:09 August 05

భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా రామాలయ నిర్మాణం

భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా, శ్రీరాముడి వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఆలయ నిర్మాణం ఉంటుందన్నారు ప్రధాని మోదీ. 

14:02 August 05

రామమందిర నిర్మాణం ఒక జాతీయ భావన

రామ మందిర నిర్మాణం ఒక జాతీయ భావన: ప్రధాని

కోట్లమంది మనో సంకల్పానికి ప్రతీక ఈ మందిరం: ప్రధాని

ఈరోజు దిగ్దిగంతాలకు శుభపరిణామం: ప్రధాని

శ్రీరాముడు అందరికీ ప్రేరణగా నిలుస్తారు: ప్రధాని

భారత ఆదర్శాలు, దర్శన్‌లో రాముడు ఉంటారు: ప్రధాని

ప్రపంచవ్యాప్తంగా రామాయణ గాథలు భిన్న రూపాల్లో లభిస్తాయి: ప్రధాని

శ్రీరాముడు అంతటా వ్యాపించి ఉన్నారు: ప్రధాని

ప్రపంచవ్యాప్తంగా రామనామం జపించే భక్తులు ఉన్నారు: ప్రధాని

కంబోడియా, మలేషియా, థాయ్‌లాండ్‌లో రామాయణ గాథలు ప్రసిద్ధం: ప్రధాని

శ్రీలంక, నేపాల్‌లో రాముడు, జానకిమాత కథలు వినిపిస్తాయి: ప్రధాని

14:00 August 05

ప్రతి హృదయం ఆనందపడుతుంది  

రామమందిర నిర్మాణ ఆరంభంతో ప్రతి హృదయం ఆనందపడుతుందన్నారు ప్రధాని మోదీ. ఇది మొత్తం దేశానికి ఒక ఉద్వేగభరితమైన క్షణమన్నారు. ఈ రోజుతో సుదీర్ఘ నిరీక్షణ ముగుస్తుందన్నారు. కొన్నేళ్లుగా ఒక గుడారం కింద నివసిస్తున్న రామ్ లల్లా కోసం ఇప్పుడు ఒక గొప్ప ఆలయం నిర్మితమవుతున్నట్లు పేర్కొన్నారు.  

13:45 August 05

  • మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం మహద్భాగ్యం: ప్రధాని
  • ఈ మహద్భాగ్యాన్ని రామమందిర ట్రస్టు నాకు కల్పించింది: ప్రధాని
  • ఈనాటి జయజయధ్వనాలు విశ్వవ్యాప్తంగా వినిపిస్తాయి: ప్రధాని
  • విశ్వవ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు మారుమోగుతున్నాయి: ప్రధాని
  • ఈనాడు దేశమంతా రామమయమైంది: ప్రధాని
  • ప్రతిఒక్కరి మనసు దేదీప్యమానమైంది: ప్రధాని
  • దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయింది: ప్రధాని
  • ఇప్పటివరకు చిన్నస్థాయి గుడి, టెంటులో ఉన్న రామమందిరం ఇకపై భవ్యమందిరంగా రూపుదిద్దుకోబోతుంది: ప్రధాని
  • రామమందిర నిర్మాణ సాకారానికి ఎందరో త్యాగాల ఫలితమిది: ప్రధాని
  • రామమందిర నిర్మాణానికి ఆత్మత్యాగం చేసిన అందరికీ 135 కోటమంది భారతీయుల తరఫున ధన్యవాదాలు: ప్రధాని
  • రాముడు అందరి మనసులో నిండి ఉన్నాడు: ప్రధాని
  • శ్రీరాముడు అంటే మర్యాద పురుషోత్తముడు: ప్రధాని
  • అలాంటి పురుషోత్తముడికి ఈనాడు భవ్యమందిర నిర్మాణం ప్రారంభమైంది: ప్రధాని

13:37 August 05

భూమిపూజ చేయడం మహద్భాగ్యం

భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. జై శ్రీరామ్‌ నినాదాలతో మోదీ  ప్రసంగాన్ని  ప్రారంభించారు. నేటి జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు.. కానీ, ప్రపంచంలో ఉన్న కోట్లమంది భక్తులకు వినిపిస్తాయన్నారు. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం తన మహద్భాగ్యం అన్నారు మోదీ. ఈ మహద్భాగ్యాన్ని రామమందిర ట్రస్టు అవకాశం కల్పించిందన్నారు.

13:33 August 05

రామమందిర నిర్మాణ శిలాఫలకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రామమందిర నిర్మాణ చిహ్నంగా పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేశారు.

13:32 August 05

లోక కల్యాణానికే రామమందిర నిర్మాణం

రామమందిర నిర్మాణం జరగాలన్నదే ప్రజల ఆకాంక్ష అన్నారు ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌ మహరాజ్‌. ఆలయం కోసం ప్రజలంతా తనువు, మనసు అర్పించేందుకు సిద్ధమయ్యారయ్యారు. దేశ నిర్మాణం.. లోక కల్యాణం కోసమో మందిర నిర్మాణమన్నారు. త్వరగా మందిర నిర్మాణం జరగాలన్నది హిందువుల ఆకాంక్ష అన్నారు.

13:20 August 05

రామమందిర నిర్మాణం కోసం ఎంతోమంది బలిదానం

  • 30 ఏళ్ల నాటి సంకల్పం సాకారం కావడం అత్యంత ఆనందదాయకం: మోహన్ భగవత్‌
  • రామమందిర నిర్మాణం కోసం ఎంతోమంది బలిదానం చేశారు: మోహన్ భగవత్‌
  • ఆత్మనిర్భర్‌ భారత్‌ అయ్యేందుకు ఇది ఆత్మవిశ్వాసం నింపుతుంది: మోహన్ భగవత్‌
  • కరోనాతో రామాలయం కోసం పాటుపడిన ప్రముఖులు రాలేకపోయారు: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌
  • ఇవాళ్టినుంచి భారతీయులందరికీ కొత్త ప్రేరణ, విశ్వాసం లభిస్తుంది: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌
  • ఎల్‌.కె.అడ్వాణీ తమ ఇంట్లో నుంచి వీక్షిస్తున్నారు: మోహన్‌ భగవత్‌
  • భవ్య మందిర నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి: మోహన్‌ భగవత్‌

13:16 August 05

500 ఏళ్ల సంఘర్షణ ఫలితమే రామాలయం

  • 500 ఏళ్ల సంఘర్షణ ఫలితమే రాముడి దేవాలయం: యోగి ఆదిత్యనాథ్‌
  • ఎందరో త్యాగాల ఫలితమిది: సీఎం యోగి ఆదిత్యనాథ్
  • ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా కల సాకారమైంది: సీఎం ఆదిత్యనాథ్
  • ప్రపంచస్థాయి మేటి విశిష్ట నగరంగా అయోధ్య రూపుదిద్దుకోబోతోంది: సీఎం
  • ప్రధాని నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం: సీఎం
  • మందిర నిర్మాణమేకాదు... భారత్‌ ఔన్నత్యాన్ని చాటే సందర్భమిది: సీఎం
  • భారత్‌ కీర్తిప్రతిష్ఠలు ప్రపంచానికి ఈ కార్యక్రమం చాటుతుంది
  • అయోధ్యలో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టాం: యోగి ఆదిత్యనాథ్
  • ఈ రోజు కోసం తరతరాలు వేచి చూశాయి: యోగి ఆదిత్యనాథ్
  • రామాలయ ట్రస్టు నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది: ఆదిత్యనాథ్
  • కొవిడ్‌ కారణంగా చాలా మంది హాజరుకాలేకపోయారు: యోగి ఆదిత్యనాథ్

13:14 August 05

రామమందిర భూమిపూజ వేళ రాష్ట్రపతి శుభాకాంక్షలు

అయోధ్యలో రామమందిర భూమి పూజను పూరస్కరించుకొని ప్రధాని మోదీ సహా హాజరైన అతిథులకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుభాకాంక్షలు తెలిపారు. రామరాజ్యానికి ప్రతీకగా  రామాలయ సముదాయం నిలుస్తుందని అయన ట్వీట్​ చేశారు.

13:06 August 05

అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎందరో త్యాగాల ఫలితం

ఎందరో త్యాగాల ఫలితమిది: సీఎం యోగి ఆదిత్యనాథ్

రాముడి ఆలయం 500 ఏళ్ల పాటు జరిగిన సంఘర్షణ ఫలితం: సీఎం యోగి ఆదిత్యనాథ్

ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా కల సాకారమైంది: సీఎం యోగి ఆదిత్యనాథ్

12:39 August 05

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ.

అయోధ్య వేదికగా మహత్తర ఘట్టం ఆవిషృతమైంది. దశాబ్దాల ఎదురుచూపుకు తెరపడింది. పుణ్యభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకుర్పారణ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న  భక్తజనం పులకించింది.  

అయోధ్య రామమందిరానికి ప్రధాని మోదీ భూమిపూజ చేశారు. అనంతరం ప్రధాని మోదీ చేతుల మీదుగా రామమందిరానికి నిర్మాణానికి వేదపండితులు శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. భూమిపూజలో యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్, పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌  పాల్గొన్నారు. శంకుస్థాపనకు నక్షత్రాల ఆకారంలోని 5 వెండి ఇటుకల వినియోగించారు. హరిద్వార్ నుంచి పవిత్ర గంగాజలం, పుణ్యనదుల నుంచి వచ్చిన జలాలతో భూమి పూజ నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

12:24 August 05

రామమందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ప్రారంభమైంది. భూమిపూజలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్,  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితర ముఖ్య అతిథులు హాజరయ్యారు. 

12:12 August 05

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగే పూజల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

12:10 August 05

రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరిగే ప్రదేశానికి ప్రధాని మోదీ చేరుకున్నారు.

12:03 August 05

హనుమాన్‌గఢీ ఆలయంలో పూజల అనంతరం ప్రధాని మోదీ పారిజాత మొక్కను నాటారు. అక్కడి నుంచి భూమిపూజ చేేసే స్థలానికి ప్రధాని బయలుదేరారు.

11:54 August 05

హనుమాన్‌గఢీ ఆలయంలో పూజల అనంతరం ప్రధాని మోదీకి  దేవాలయ పూజారి తలపాగా, వెండి కిరీటం బహూకరించారు.

11:45 August 05

హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

11:43 August 05

హనుమాన్‌గఢీ ఆలయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. అక్కడ ఆంజనేయస్వామికి మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. 

11:30 August 05

ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ప్రధానికి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్​ స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీ నేరుగా హనుమాన్ ఆలయానికి వెళ్లనున్నారు.

11:16 August 05

ప్రధాని మోదీ కాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమనంలో లఖ్‌నవూ చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అయోధ్యకు బయలుదేరారు. అయోధ్యకు వెళ్లగానే తొలుత 10వ శతాబ్దానికి  చెందిన హనుమాన్ ఆలయానికి మోదీ వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భూమిపూజ ప్రదేశానికి చేరుకోనున్నారు ప్రధాని. భూమిపూజకు ముందు ఆ ప్రాంతంలో పారిజాత మొక్కను నాటనున్నారు మోదీ.

11:12 August 05

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ అయోధ్యలో భూమిపూజ జరిగే రామజన్మభూమి ప్రాంతానికి చేరుకున్నారు. 

11:08 August 05

ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకోగానే మొదట పురాతన హనుమాన్​ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజలు చేసిన తర్వాత భూమిపూజ చేసే ప్రాంతానికి వెళ్లనున్నారు.

10:50 August 05

రామమందిర నిర్మాణానికి ప్రత్యక్ష సాక్ష్యులవడం మా అదృష్టం

రామమందిర నిర్మాణానికి ప్రత్యక్ష సాక్ష్యులవడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రముఖ యోగా గురువు రామ్​దేవ్​బాబా అన్నారు. రామరాజ్య స్థాపనకు అక్కడ 'పతంజలి' ఆధ్వర్యంలో ఉన్నత విలువలతో గురుకులాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

10:43 August 05

దేశం మొత్తాన్ని అయోధ్య ఏకం చేసింది: ఉమాభారతి

అయోధ్యలో జరుగుతున్న భూమి పూజ దేశ మొత్తాన్ని ఏకం చేసిందన్నారు భాజపా సీనియర్​ నేత ఉమా భారతి. ఇక్కడ ఎలాంటి వివక్ష లేదని ఈ ఘట్టంతో దేశం ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.

10:30 August 05

చేరుకుంటున్న అతిథులు

భూమి పూజ జరిగే రామజన్మ భూమి ప్రాంతానికి ఒక్కొక్కరుగా అతిథులు చేరుకుంటున్నారు. యూపీ గవర్నర్​ ఆనందిబెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్​, భాజపా సీనియర్​ నేత ఉమాభారతి ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు.

10:23 August 05

భుమిపూజకు వచ్చే అతిథుల కోసం అయోధ్యలో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ప్రధాని మోదీ, ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​, ఆలయ ట్రస్ట్​ చీఫ్​ గోపాల్​దాస్​, యూపీ గవర్నర్​ ఆనందిబెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఆ వేదికపై ఆసీనులుకానున్నారు.
 

10:16 August 05

ఆర్​ఎస్​ఎస్​ సంబరాలు..

రామమందిరానికి భూమిపూజ జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్రలో ఆర్​ఎస్​ఎస్​ ఆధ్యర్యంలో సంబురాలు చేసుకుంటున్నారు. కార్యాలయం ఎదుట రంగవల్లులు వేసి తమ సంతోషాన్ని తెలియజేశారు.

10:08 August 05

రామమందిర భూమిపూజ కోసం ఇప్పటికే వేదపండితులు రామ్​లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రధాని మోదీ ఈ విగ్రహం ప్రతిష్ఠించిన చోట ఆలయానికి భూమి పూజ చేయనున్నారు.

10:01 August 05

రామమందిర భూమి పూజ నేపథ్యంలో అయోధ్యలో యూపీ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రధాని మోదీ వేడుకకు హాజరవుతుండగా.. ప్రోటోకాల్​ ప్రకారం అతిథులను అనుమతించనున్నారు.

09:58 August 05

రామాలయ నిర్మాణానికి నేడు భూమి పూజ నేపథ్యంలో ప్రధాని మోదీ అయోధ్యకు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఆయన అయోధ్యకు పయనమయ్యారు.  

09:51 August 05

భూమి పూజలో భాగంగా అయోధ్యను ట్రస్ట్​ ఆధ్వర్యంలో సుందరంగా అలంకరించారు.

09:26 August 05

మహా వేడుకకు ముస్తాబైన అయోధ్య

కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం సాకారమయ్యే అద్భుత క్షణం ఆసన్నమైంది. రామాయణంలోని ఉత్కృష్ట ధర్మాన్ని యావత్​ ప్రపంచానికి చాటిచెప్పే విశ్వమందిర నిర్మాణానికి అంకురార్పణ చేసే ముహూర్తం సమీపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరగనుంది. శ్రీరామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్​ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

అయోధ్య సర్వం సిద్ధం...

శంకుస్థాపన మహోత్సవానికి చారిత్రక అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భవ్య రామమందిర భూమిపూజ సందర్భంగా... అక్కడి ఆలయాలు, రహదారులు సహా అడుగడుగునూ శోభాయమానంగా తీర్చిదిద్దారు. దీపాలతో అయోధ్య వీధులు కళకళలాడుతున్నాయి.భూమిపూజకు సంబంధించి నగరంలో ఇప్పటికే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శంకుస్థాపన మహోత్సవానికి తరలి రావాలని దేవుళ్లు, దేవతలను ఆహ్వానించడానికి మంగళవారం 'రామార్చన పూజ' చేశారు. వేదమంత్రాలతో రామ జన్మభూమి ప్రాంగణమంతా మారుమోగుతోంది.

12 గంటల 15 నిమిషాలకు...

రామమందిర శంకుస్థాపన కోసం ప్రధాని మోదీ బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు అయోధ్యకు చేరుకోనున్నారు. ఆ వెంటనే హనుమాన్​గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాముడిని దర్శించుకునే ముందు ఇక్కడనున్న హనుమంతుడికి పూజలు చేయాలని ప్రజలు విశ్వసిస్తారు. ప్రధాని అక్కడే 5-7 నిమిషాల పాటు ఉంటారు.

అనంతరం అక్కడి నుంచి రామమందిర శంకుస్థాపన వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. అయితే అప్పటికే భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభమవుతుంది. ఆయన వచ్చేలోగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తిచేస్తారు.

మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో క్రతువు ముగిసేలా ముహూర్తం నిర్ణయించారు. ఆ సయంలో వేద పఠనం, మంత్రోచ్ఛారణల నడుమ ప్రధాని మోదీ స్వయంగా గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే భూమి పూజ కార్యక్రమంలో ఐదు వెండి ఇటుకలను కూడా ఉపయోగించనున్నారు. మధ్యాహ్నం 1:30 వరకు భూమిపూజ జరిగే అవకాశముంది.

అతిథులు కుదింపు...

కరోనా వైరస్​ నేపథ్యంలో అతిథుల సంఖ్యను భారీగా కుదించారు. తొలుత 200కుపైగా అతిథులను అనుకున్నప్పటికీ.. ఆ సంఖ్యను 170-180కి పరిమితం చేశారు. ఈ జాబితాలో.. ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌, రామజన్మభూమి న్యాస్‌ అధిపతి నృత్యగోపాల్‌ దాస్‌, సంఘ్‌ నేతలు భయ్యాజీ జోషి, దత్తాత్రేయ హోసబలే, విశ్వహిందూ పరిషత్‌ కార్యాధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ తదితరులతో పాటు దాదాపు 50 మంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. భాజపా అగ్రనేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌జోషిలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.

వేదికపై ప్రధాని మోదీతో పాటు మోహన్‌ భాగవత్‌, నృత్యగోపాల్‌ దాస్‌, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాత్రమే ఉంటారు.

ప్రత్యక్ష ప్రసారం...

కరోనా తీవ్రత దృష్ట్యా శంకుస్థాపన వేడుకకు తరలి రావద్దంటూ అనుచరులకు, భక్తులకు ట్రస్టు నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అయోధ్య, ఫైజాబాద్‌లో ఎల్‌ఈడీ తెరలను, శంకుస్థాపన అనంతరం ప్రధాని ప్రసంగాన్ని వినేందుకు లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేశారు.

కట్టుదిట్టమైన భద్రత...

అయోధ్య భూమిపూజ, ప్రధాని రాక నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భద్రత బలగాలు అప్రమత్తత ప్రకటించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఇప్పటికే పోలీసులు అయోధ్య వీధుల్లో భారీ స్థాయిలో గస్తీ కాస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

Last Updated : Aug 5, 2020, 2:26 PM IST

For All Latest Updates

TAGGED:

ram temple

ABOUT THE AUTHOR

...view details