మొక్కల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ.. ఓ రావి చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు తమిళనాడు యువకులు. ఆ వృక్షానికి నలభై ఏళ్లు నిండిన సందర్భంగా కేక్ కోసి.. ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు.
ఎందుకంటే.?
మొక్కల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ.. ఓ రావి చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు తమిళనాడు యువకులు. ఆ వృక్షానికి నలభై ఏళ్లు నిండిన సందర్భంగా కేక్ కోసి.. ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు.
ఎందుకంటే.?
కోయంబత్తూర్లోని పులియాకులం కురుపారాయణ్ కోయిల్ వీధిలో చాలా ఏళ్ల క్రితం ఓ రావి మొక్కను నాటారు. కొద్ది కాలం తర్వాత సరైన పోషణ లేక అది వాడిపోయింది. ఈ విషయం గమనించిన స్థానికులు.. అప్పటి నుంచి దానికి తరచూ నీరు పోయడం అలవాటు చేసుకున్నారు. ఇలా ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఆ చెట్టుకు నలభై ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆ వృక్షానికి జన్మదిన వేడుకలు నిర్వహించారు అక్కడి యువకులు. చెట్టుకింద వినాయక విగ్రహాన్ని ఉంచి పూజలు చేశారు. ఇకపై ఏటా ఇలాంటి వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"