తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరానికి కడుపు నొప్పి... ఎయిమ్స్​లో చికిత్స

ఐఎన్​ఎక్స్​ మీడియా అవినీతి కేసులో అరెస్టయి తిహార్​ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి శనివారం దిల్లీ ఎయిమ్స్​లో వైద్యపరీక్షలు నిర్వహించారు వైద్యులు. కడుపు నొప్పి ఉందని చెప్పటం వల్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు.

చిదంబరానికి కడుపు నొప్పి... ఎయిమ్స్​లో చికిత్స

By

Published : Oct 6, 2019, 5:05 AM IST

Updated : Oct 6, 2019, 5:58 AM IST

చిదంబరానికి కడుపు నొప్పి... ఎయిమ్స్​లో చికిత్స

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో భాగంగా తిహార్​ జైలులో ఉన్న సీనియర్​ కాంగ్రెస్​ నేత పి.చిదంబరానికి దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్​)లో శనివారం వైద్య పరీక్షలు జరిగాయి.

కడుపునొప్పిగా ఉన్నట్లు ఆయన ఫిర్యాదు చేయడం వల్ల శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జైలు సిబ్బంది చిదంబరంను ఎయిమ్స్​కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను తిరిగి జైలుకు తరలించినట్లు అధికారు తెలిపారు.

ఈనెల 17 వరకు జైలులోనే..

ఐఎన్​ఎక్స్​ మీడియా అవినీతి కేసులో అరెస్టయిన చిదంబరం జుడీషియల్​ కస్టడీని అక్టోబర్​ 17 వరకు పొడగిస్తూ దిల్లీ కోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. కేసు విచారణలో భాగంగా సీబీఐ అభ్యర్థన మేరకు ఈ తీర్పు చెప్పింది.

2004-14 మధ్య చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపు రూ.305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందినట్లు ఆరోపణలతో 2017 మే 15న ఆయనపై సీబీఐ ఛార్జిషీట్​ దాఖలు చేసింది. 2019, ఆగస్టు 21న అరెస్ట్​ చేసింది.

ఇదీ చూడండి: పారే నీటిలో ఓ డిన్నర్.. కావాలంటే ఛలో బెంగళూర్..!

Last Updated : Oct 6, 2019, 5:58 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details