తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైంగిక వేధింపుల ఆరోపణలతో చిన్మయానంద్​ అరెస్టు - bjp leader chinmayanad arrested in sexual harrasment case

భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్​ను లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టు చేశారు ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు. ఉత్తర్​ప్రదేశ్ షాజాన్​పూర్​లో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. చిన్మయానంద్​కు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది స్థానిక కోర్టు.

లైంగిక వేధింపుల కేసులో స్వామి చిన్మయానంద అరెస్టు

By

Published : Sep 20, 2019, 11:04 AM IST

Updated : Oct 1, 2019, 7:33 AM IST

లైంగిక వేధింపుల ఆరోపణలతో చిన్మయానంద్​ అరెస్టు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ను సిట్‌ పోలీసులు అరెస్టు చేశారు. న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో చిన్మయానంద్‌ను... ఉత్తర్​ప్రదేశ్‌లోని షాజాన్‌పూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత మధ్య ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్మయానంద్​కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది స్థానిక కోర్టు.

ఫేస్​బుక్​లో ఆరోపణలు..తర్వాత కేసు

న్యాయ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడినట్లు చిన్మయానంద్‌పై గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు యూపీలో పలు ఆశ్రమాలు, విద్యాసంస్థలు ఉన్నాయి. చిన్మయానంద్‌కు చెందిన ఓ కళాశాలలో చదువుతున్న న్యాయ విద్యార్థిని ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. బ్లాక్‌మెయిల్‌ చేసి తనపై ఆయన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ గత నెల 24న ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను విచారణ సమయంలో పోలీసులకు తెలిపారు.

ఈ కేసు వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటుచేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌ బృందం చిన్మయానంద్‌ను పలుమార్లు విచారించింది. అయితే అప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయలేదని పోలీసుల తీరుపై బాధితురాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను చనిపోతేగానీ ఆయనపై కేసు పెట్టరేమోనని ఆవేదన చెందారు. ఈ క్రమంలో నేడు చిన్మయానంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​పై తీర్మానం ఫైల్​ చేయలేకపోయిన పాక్​

Last Updated : Oct 1, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details