తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరణానంతరం 'జైట్లీ'ని వరించిన పద్మవిభూషణ్​ - దివంగత నేత అరుణ్​జైట్లీని వరించిన పద్మవిభూషణ్​

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీకి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్​ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జైట్లీ... మునుపటి మోదీ సర్కార్​లో ఆర్థికమంత్రిగా కీలక పాత్ర పోషించారు.

arun jaitley got padma vibhushan
దివంగత నేత అరుణ్​జైట్లీని వరించిన పద్మవిభూషణ్​

By

Published : Jan 25, 2020, 9:31 PM IST

Updated : Feb 18, 2020, 10:00 AM IST

దివంగత నేత అరుణ్​జైట్లీకి పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జైట్లీ... మునుపటి మోదీ సర్కార్​లో ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషించారు.

బాల్యం...

అరుణ్​జైట్లీ 1952 డిసెంబర్​​ 28న పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి మహారాజ్​ కిషన్​ జైట్లీ ప్రముఖ న్యాయవాది. ​జైట్లీ దిల్లీ నుంచే డిగ్రీ, న్యాయశాస్త్ర పట్టా పొందారు. దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న సమయంలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు.

రాజకీయాల్లోకి రాకముందు జైట్లీ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్​ చేశారు. ఆయనను సీనియర్​ న్యాయవాదిగా దిల్లీ హైకోర్టు గుర్తించింది.

విద్యార్థి దశలోనే...

అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో జైట్లీ చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన యువ మోర్చా కన్వీనర్. పోరాటంలో పాల్గొన్నందుకు జైట్లీ అంబాలా, తీహార్​ జైలులో 19 నెలలు ఉన్నారు. విడుదలయ్యాక జనసంఘ్‌లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.

1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. వాజ్​పేయీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. వివిధ రాష్ట్రాల్లో భాజపా ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారు. 2014 సార్వత్రికంలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

ఆర్థిక మంత్రిగా మంచి గుర్తింపు...

మోదీ-1 ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక, రక్షణ, కార్పొరేట్​ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వంలో వివాద పరిష్కర్తగా గుర్తింపు పొందారు. అనారోగ్యం కారణంతో ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2018 మే నెలలో ఆయనకు మూత్రపిండాల మార్పిడి జరిగింది. దీంతో కొంతకాలంపాటు ఆయన స్థానంలో పీయూష్‌ గోయల్‌ ఆర్థిక మంత్రిత్వశాఖను నిర్వహించారు. దీర్ఘకాల మధుమేహం కారణంగా పెరిగిన శరీర బరువును తగ్గించుకోవడానికి 2014లో ఆయన బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

2019 ఎన్నికల అనంతరం.. అనారోగ్యం కారణంగా మంత్రిత్వ పదవులకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు జైట్లీ. భాజపా అగ్రనేతగా సాగిన ఆయన 2019 ఆగస్టు 24న మరణించారు.

ఇదీ చూడండి: భారత 71వ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

Last Updated : Feb 18, 2020, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details