దిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్
13:00 May 12
దిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్
అనారోగ్యంతో ఆదివారం రాత్రి దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నందున వైద్యులు ఆయన్ను ఇంటికి పంపారు.
కరోనా నెగిటివ్...
జ్వరంతో బాధపడుతున్న మన్మోహన్‌కు ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందించారు. సింగ్ పరిస్థితి బాగానే ఉందని సోమవారం ఉదయం ప్రకటించారు. ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించారు. మాజీ ప్రధానికి వైరస్ సోకలేదని నిర్ధరించారు. సోమవారం సాయంత్రానికి మన్మోహన్‌కు జ్వరం తగ్గగా... వైద్యులు నేడు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు.