మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ పైనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
వెంటిలేటర్‌పైనే ప్రణబ్‌కు చికిత్స: ఆర్మీ ఆసుపత్రి - మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ ఆస్పత్రి తెలిపింది. ఆరోగ్య సూచిలన్నీ నిలకడగానే ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది.
వెంటిలేటర్ పైనే ప్రణబ్‌కు చికిత్స.. ఆర్మీ ఆసుపత్రి ప్రకటన
ముఖర్జీ ఆగస్టు 10న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. అదే రోజు ఆయనకు మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స నిర్వహించారు. అంతకుముందే ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.