తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం - Former president Pranab Mukherjee is dead

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు. దిల్లీ కంటోన్మెంట్​లో ఉన్న సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Former president Pranab Mukherjee is dead
తుదిశ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్

By

Published : Aug 31, 2020, 6:27 PM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కన్నుమూశారు. దిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రణబ్ మరణవార్తను ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

"నా తండ్రి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. దేశ వ్యాప్తంగా ప్రార్థనలు, వైద్యులు కృషి చేసినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచారు. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా." అని ట్వీట్ చేశార అభిజిత్.

ఆగస్టు 10న దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు ముఖర్జీ. అదే రోజు ఆయనకు బ్రెయిన్​ సర్జరీ నిర్వహించారు. అప్పటికే ప్రణబ్​కు కరోనా సోకినట్లు తేలింది. తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చింది. కొద్దిరోజులుగా కోమాలోనే ఉన్న ప్రణబ్​గా వెంటిలేటర్​పై చికిత్స అందిస్తూ వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details