భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. ఈ మేరకు దిల్లీ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. వెంటిలేటర్‌పైనే ఉంచి.. చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
'ప్రణబ్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు' - telugu news updates
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కీలక పారామితులన్నీ స్థిరంగా ఉన్నాయని చెప్పారు.
ప్రణబ్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు!
ప్రణబ్ కీలక సూచీలన్నీ బాగున్నాయని.. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం 10 రోజుల ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. అప్పటికే ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈనెల 10న ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:కాస్త మెరుగుపడిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
TAGGED:
...