అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విందుకు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ నిరాకరించినట్లు సమాచారం. ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా ఇవ్వనున్న విందుకు పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించారు. అందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం పంపారు.
రాష్ట్రపతి విందుకు మన్మోహన్ గైర్హాజరు! - ట్రంప్ విందు కాంగ్రెస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకారని సమాచారం. తొలుత రాష్ట్రపతి ఆహ్వానాన్ని మన్మోహన్ అంగీకరించినప్పటికీ తర్వాత మనసు మార్చుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
మన్మోహన్
అయితే ఈ విందుకు హాజరయ్యేందుకు మన్మోహన్ తొలుత అంగీకరించినప్పటికీ తర్వాత మనసు మార్చుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు సింగ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ అజాద్ సైతం ఈ విందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీకిి విందుకు ఆహ్వానం రాకపోవడంపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ విందుకు హాజరవ్వడం లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ ఇప్పటికే స్పష్టం చేశారు.
Last Updated : Mar 2, 2020, 11:08 AM IST
TAGGED:
Manmohan Singh Donald Trump