మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని దిల్లీ ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. కొత్త మందులు రియాక్షన్ ఇవ్వడం, జ్వరం రావడానికి కారణాలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు వైద్యులు.
87 ఏళ్ల మన్మోహన్ను గుండె-ఊపిరిత్తుల విభాగంలో పరిశీలనలో ఉంచారు. గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ నితీశ్ నాయక్ పర్యవేక్షణలో మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఆయన వైద్య పరామితులన్నీబాగానే ఉన్నాయని సన్నిహితులు తెలిపారు. అయినప్పటికీ పరిశీలనలో ఉంచినట్లు పేర్కొన్నారు. 2009లో ఎయిమ్స్ వైద్యులే మన్మోహన్ సింగ్‌కు బైపాస్ సర్జరీ చేశారు.