నాగాలాండ్ మాజీ గవర్నర్, సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్వనీకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. సిమ్లాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. గతంలో ఆయన నాగాలాండ్, మణిపూర్ గవర్నర్‌గా, హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. గతకొంత కాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్నారని, ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, ఇందిరా గాంధీ వైద్య కళాశాల- ఆస్పత్రి (ఐజీఎంసీ) వైద్యులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అశ్వనీకుమార్ మరణాన్ని సిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా ధ్రువీకరించారు. ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎస్పీ తెలిపారు. ఎంతోమంది పోలీస్ అధికారులకు ఆయన ఆదర్శప్రాయులుగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు.