తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుండెపోటుతో మధ్యప్రదేశ్​ మాజీ సీఎం బాబూలాల్ మృతి - గుండెపోటు

మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్​ నేత బాబూలాల్​ గౌర్ (89) బుధవారం ఉదయం మరణించారు. కొద్ది కాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్​ మాజీ సీఎం బాబూలాల్ గుండెపోటుతో మృతి

By

Published : Aug 21, 2019, 9:19 AM IST

Updated : Sep 27, 2019, 6:02 PM IST

మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత బాబూలాల్​ గౌర్​ బుధవారం ఉదయం గుండెపొటుతో మరణించారు. ఆయన మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ సహా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. బాబూలాల్​ సేవలు కొనియాడారు.

మధ్యప్రదేశ్​ మాజీ సీఎం బాబూలాల్ మృతి పట్ల ప్రధాని సంతాపం
మధ్యప్రదేశ్​ మాజీ సీఎం బాబూలాల్​ మృతిపట్ల సీఎంవో సంతాపం

కొద్ది కాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న89ఏళ్ల బాబూలాల్​భోపాల్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాతున్నారు. ఇవాళ ఉదయం ఒక్కసారిగా గుండెపోటు రావడం వల్ల ఆయన కన్నుమూశారని వైద్యులు తెలిపారు.

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా...

బాబూలాల్​ 1930 జూన్​ 2న ఉత్తరప్రదేశ్​లోని ప్రతాప్​గఢ్​​లో జన్మించారు. మొదటగా ట్రేడ్​ యూనియన్ నాయకుడుగా ఎదిగారు. తర్వాతి కాలంలో మధ్యప్రదేశ్​లోని గోవింద్​పుర విధానసభ స్థానం నుంచి ఏకంగా పదిసార్లు ఎన్నికయ్యారు. 2004-2005 మధ్య మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగానూ ఆయన సేవలందించారు.

ఇదీ చూడండి: మహాత్ముని కళాఖండాలన్నీ ఒక చోట చేర్చితే!

Last Updated : Sep 27, 2019, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details