ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి పోటీ చేసేందుకు సరిహద్దు రక్షణ దళం(బీఎస్ఎఫ్) మాజీ సైనికుడు తేజ్‌బహదూర్ యాదవ్ వేసిన నామినేషన్‌ను తిరస్కరించారు ఎన్నికల అధికారులు. వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రధాని మోదీపై పోటీకి దిగారు తేజ్‌బహదూర్.
సుప్రీంకు వెళతాం..
" నిన్న సాయంత్రం 6.15 నిమిషాలకు ఆధారాలు సమర్పించాలని అడిగారు. నేను ధనవంతుడిని కాదు. హెలికాప్టర్ తీసుకొని దిల్లీలోని ఎన్నికల సంఘానికి వెళ్లేందుకు, ఆధారాలను ఆగమేఘాలపైన తెచ్చేందుకు. అయినా ప్రయత్నించాం. పత్రాలు తెచ్చాం. ఆ తర్వాత కూడా నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ రోజు ఉదయం 11 గంటల ముందు ఆధారాలు తీసుకురాలేదని చెబుతున్నారు. నియంతృత్వంగా తిరస్కరించారు. ఎన్నికల అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు." -- తేజ్ బహదూర్ యాదవ్, మాజీ జవాను
ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తేజ్ ప్రతాప్ తరఫు న్యాయవాది చెప్పారు.