దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌కు ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాళులు అర్పించారు.
షీలా దీక్షిత్‌కు ప్రముఖుల నివాళులు - delhi cm
19:53 July 20
మాజీ సీఎంకు కేజ్రీవాల్ నివాళి
19:39 July 20
ప్రధాని సంతాపం
నిజాముద్ధీన్లోని షీలా నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ చేరుకున్నారు. ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
19:37 July 20
నివాళులు అర్పించిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా
షీలా నివాసానికి చేరుకున్న లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా .. ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. షీలాజీది అమ్మలాంటి వ్యక్తిత్వమని కొనియాడారు బిర్లా. దిల్లీలో షీలా రాజకీయ, సామాజిక ప్రస్థానం చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు.
19:32 July 20
సోనియా గాంధీ నివాళులు
నిజాముద్దీన్ నివాసానికి చేరుకున్నారు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ. షీలా పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
19:05 July 20
నిజాముద్దీన్‌లోని నివాసానికి ప్రముఖులు
షీలా దీక్షిత్ భౌతిక కాయానికి దర్శించేందుకు నిజాముద్దీన్‌లోని నివాసానికి రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు వస్తున్నారు.
18:11 July 20
రేపు మధ్యాహ్నం బోధ్ ఘాట్‌కు అంతిమయాత్ర
- నిజాముద్దీన్ షీలా నివాసంలో భౌతికకాయం
- షీలా పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
- పార్టీ శ్రేణుల సందర్శన కోసం రేపు మధ్యాహ్నం 12 గం.కు కాంగ్రెస్ కార్యాలయానికి షీలా పార్థివదేహం
- రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు
17:57 July 20
రెండు రోజుల పాటు సంతాప దినాలు
మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరణంతో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది దిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియాా ఓ ప్రకటన చేశారు.
16:20 July 20
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ కన్నుమూశారు. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో 81 ఏళ్ల షీలా దీక్షిత్ బాధపడుతున్నారు. గతేడాది ఫ్రాన్స్‌లో హృదయ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారు.
1998 నుంచి 2013 వరకు దిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా... పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలో 1938లో జన్మించారు. దిల్లీలోనే ఆమె విద్యాభ్యాసం జరిగింది. దిల్లీ విశ్వవిద్యాలయంలో మిరాండా హౌస్ నుంచి ఎంఏ హిస్టరీలో పట్టభద్రులు అయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన ఐఏఎస్ వినోద్ దీక్షిత్‌తో ఈమె వివాహం జరిగింది.
1984లో ఉత్తరప్రదేశ్ కనౌజ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 1998లో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత దిల్లీ రాజకీయాలకు పరిమితమయ్యారు షీలా. దిల్లీ చరిత్రలో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన ఘనత ఆమె సొంతం.
యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి షీలా దీక్షిత్ అత్యంత సన్నిహితురాలు. దిల్లీ కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకురాలు ఆమె.
షీలా దీక్షిత్ మరణంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి విచారం
"షీలా దీక్షిత్ మరణ వార్త బాధ కలిగించింది. ఒక సీనియర్ రాజకీయ నేతను కోల్పోయాం. రాజధాని ముఖచిత్రం మారడంలో షీలా కృషి గుర్తుంచుకోదగినది. "
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
ప్రధాని దిగ్భ్రాంతి
"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమెది స్నేహపూర్వక వ్యక్తిత్వం. దిల్లీ అభివృద్ధిలో ఆమె భాగస్వామ్యం మరువలేం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి."
-ప్రధాని నరేంద్రమోదీ
కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం
"మీరు లేరన్న మాట ఎంతో బాధ కలిగిస్తోంది. జీవితాంతం కాంగ్రెస్ వ్యక్తిగా ఉన్నారు. 3 సార్లు సీఎంగా దిల్లీ ముఖచిత్రాన్నే మార్చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి."
-కాంగ్రెస్
ఎంతో బాధించింది: రాహుల్
షీలా మరణంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఇతర అగ్రనేతలు విచారం వ్యక్తం వేశారు.
"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమె కాంగ్రెస్ ప్రియ పుత్రిక. మూడు సార్లు దిల్లీ సీఎంగా ఎన్నికయి.. రాజధానికి ఎంతో సేవ చేశారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు