తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ సీజేఐకే టోకరా వేసిన సైబర్​ నేరగాళ్లు - సీజేఐ

సుప్రీం మాజీ ప్రధాన  న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​ఎం లోధాకు సైబర్​ నేరగాళ్లు రూ.లక్షకు టోకరా వేశారు. ఆయన స్నేహితుడి ఈ-మెయిల్​ను హ్యాక్​ చేసిన దుండగులు జస్టిస్ లోధాను మోసగించారు.

జస్టిస్​ లోధా

By

Published : Jun 3, 2019, 3:15 PM IST

Updated : Jun 3, 2019, 3:38 PM IST

భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రాజేంద్ర మల్​ లోధాను మోసగించారు సైబర్​ నేరగాళ్లు. ఆయన స్నేహితుడి ఈ-మెయిల్​ను హ్యాక్​ చేసిన దుండగులు లక్ష రూపాయలు కాజేశారు. మోసాన్ని గ్రహించి దక్షిణ దిల్లీలోని మాలవ్యానగర్​ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు జస్టిస్ లోధా.

ఈ-మెయిల్​ ద్వారా..

మే 19 రాత్రి తన స్నేహితుడు, మాజీ సహోద్యోగి జస్టిస్​ బీపీ సింగ్​ నుంచి ఈ-మెయిల్​ వచ్చిందని జస్టిస్ లోధా తెలిపారు.

"తన సోదరుడు లింఫోబ్లాస్టిక్​ లుకేమియాతో బాధపడుతున్నాడని, చికిత్సకు అవసరమయ్యే డబ్బులు లేవని బీపీ సింగ్​ మెయిల్​ చేశారు. సాయం చేయాలని కోరగా వెంటనే వారు సూచించిన బ్యాంకు ఖాతాకు లక్ష రూపాయలు పంపించాను. తన ఈమెయిల్​ ఖాతాను ఎవరో హ్యాక్​ చేశారని మే 30న సింగ్​ తెలిపిన తర్వాత మోసపోయానని గ్రహించా."

-జస్టిస్​ లోధా, మాజీ సీజేఐ

జస్టిస్​ లోధా భారత 41వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2014 సెప్టెంబర్​లో పదవీ విరమణ చేశారు. బీసీసీఐలో సంస్కరణల కోసం నియమించిన కమిటీకి జస్టిస్ లోధానే నేతృత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: 'గన్​ లైసెన్స్ కావాలంటే మొక్కలు నాటాల్సిందే'

Last Updated : Jun 3, 2019, 3:38 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details