సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయికి జడ్ ఫ్లస్ వీఐపీ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దేశంలో జస్టిస్ రంజన్ గొగొయి పర్యటించేటప్పుడు ఆయనకు 8నుంచి 12 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణ కల్పిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఆయన నివాసానికి కూడా భద్రత కల్పిస్తాయని తెలిపారు. కాగా జడ్ ఫ్లస్ వీఐపీ కేటగిరీలో భద్రత పొందే 63 వ్యక్తుల్లో జస్టిస్ రంజన్ గొగొయ్ చేరారు.