మాజీ సీఈసీ టీ.ఎన్. శేషన్ కన్నుమూత - former CEC T.N seshan
మాజీ సీఈసీ టీ.ఎన్. శేషన్ కన్నుమూత
18:17 November 10
మాజీ సీఈసీ టీ.ఎన్. శేషన్ కన్నుమూత
కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్ (87) కన్నుమూశారు. 1990-96 మధ్య ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సేవలందించారు. 1996లో రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. తన పదవీకాలంలో ఎన్నికల్లో భారీగా సంస్కరణలు అమలు చేశారు టి.ఎన్.శేషన్. ఆయన తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మార్చేశాయి. ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి చెక్ పెట్టడంలో శేషన్ ఎంతో కృషి చేశారు.
సీఈసీగా సాధించిన విజయాలు...
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలుపరిచేలా చర్యలు
- అర్హత గల ఓటర్లకు ఓటరు ఐడీలను జారీ చేయడం
- ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయంపై పరిమితి
Last Updated : Nov 10, 2019, 11:27 PM IST