"పాశ్చాత్య ఆవులు.. అవి అసలు గోవులే కావు. అవి ఓ రకమైన జంతువులు. విదేశీ ఆవులు మన గోమాతలు కావు. అవి కేవలం ఆంటీలు మాత్రమే.
స్వదేశీ ఆవులు అమ్మలాంటివి.. అవి బంగారు పాలనిస్తాయి. ఆ పాలల్లో బంగారం కలిసి ఉంటుంది. అందుకే దేశీయ ఆవు పాలు బంగారు వర్ణంలో ఉంటాయి. మనం ఆ పాలను తాగితే ఆరోగ్యంగా ఉంటాము.
గోమాత పాలు తాగి ఎవరైనా ఆ తల్లితో చెడుగా ప్రవర్తిస్తే, వారికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తా. పవిత్రమైన భరత భూమి మీద గోవులను చంపి, మాంసం తినడం నేరం. కొందరు మేధావులు బహిరంగంగా ఆవు మాంసం తింటారు. వారు కుక్క మాంసమూ తినాలని నేను చెబుతాను. అప్పుడు వాళ్ల ఆరోగ్యాలు మరీ బాగుంటాయి. కానీ రోడ్లపైన ఎందుకు తింటారు? మీ ఇంట్లో తినండి "
'విదేశీ గోవులు 'ఆంటీలు'.. మన ఆవులే అమ్మలు' - foriegn dogs are auties says BJP leader
'విదేశీ గోవులు ఆంటీలు.. మన ఆవులే అమ్మలు' అంటూ వ్యాఖ్యలు చేశారు బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్. స్వదేశీ గోమాత పాలు బంగారం లాంటివని, పాశ్చాత్య ఆవు పాలు అలాంటివి కాదని.. ఆ ఆవులు 'ఆంటీలు' లాంటివంటూ చెప్పుకొచ్చారు.
'గోమాంసం తినేవాళ్లు.. కుక్క మాంసమూ తినండి'
-దిలీప్ ఘోష్, బంగాల్ భాజపా అధ్యక్షుడు
దిలీప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మొదటిసారేమీ కాదు.. గతంలో పోలీసులను, టీఎంసీ పార్టీ నేతలను కొట్టమని భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఇప్పుడు మరోసారి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.