దేశంలో కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్స అందించే విషయంలో వైద్యులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎర్నాకులంలోని వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బ్రిటిష్ జాతీయుడికి హెచ్ఐవీ-ఎయిడ్స్ మందులను వినియోగించారు. అతడు కోలుకున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
ఏడు రోజుల్లోనే..
బ్రిటన్ నుంచి వచ్చిన పౌరుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతనికి రిటొనావిర్, లొపినావిర్ కాంబినేషన్ మందులతో చికిత్స అందించారు. ఏడు రోజుల తర్వాత జరిపిన పరీక్షల్లో అతనికి కరోనా నెగటివ్ వచ్చింది.
కరోనా బారినపడినవారికి ఈ కాంబినేషన్ మందులు ఇచ్చేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి ఇచ్చింది. ఇప్పటికే జైపుర్‌లోని ఆసుపత్రిలో కరోనా సోకిన విదేశీ వైద్యుడికి ఇవే మందులతో చికిత్స చేశారు. ఆయన కూడా కోలుకున్నాడు.
ఇదీ చూడండి:సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?