తబ్లీగీ జమాతే కార్యకలాపాల్లో భాగస్వామ్యమైన 3,500 మందికిపైగా విదేశీయులను 10 ఏళ్లపాటు భారత్లోకి రాకుండా నిషేధించటాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేయాలని కోరారు.
మొదటగా 960 మందిపై నిషేధం విధిస్తూ ఏప్రిల్ 2 ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. ఆ తర్వాత మరో 2,500 మందికిపైగా నిషేధిస్తూ జూన్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ఆదేశాలను సవాల్ చేస్తూ న్యాయవాది ఫుజైల్ అహ్మద్ ఆయూబీ ద్వారా నాలుగు రాతపూర్వక వ్యాజ్యాలు దాఖలు చేశారు ప్రస్తుతం భారత్లో ఉన్న విదేశీయులు.
"అది ఏకపక్ష నిర్ణయం. ముఖ్యంగా నిషేధానికి గురైన విదేశీయుల మాట వినికుండా.. మొదటి తప్పుగా భావించి అవకాశం ఇవ్వటం.. నోటీసులు ఇవ్వటం వంటివి చేయకుండా తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. భారత్లో ఉన్నవారు తమను తాము రక్షించుకోవడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకపోవటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘనే అవుతుంది. "