రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భారత అపరకుబేరుల్లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. 2018 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో వరుసగా 12వ సారి ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 51.4 బిలియన్ డాలర్లు. జియో వల్ల ఆయన సంపద 4.1 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని ఫోర్బ్స్ పేర్కొంది.
అదానీ పోర్ట్స్ అధినేత గౌతమ్ అదానీ ఫోర్బ్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 15.7 బిలియన్ డాలర్లు. గతేడాది రెండో స్థానంలో ఉన్న అజిమ్ ప్రేమ్జీ ఈసారి 17వ స్థానానికి పడిపోయారు. అజిమ్ ప్రేమ్జీ తన సంపదలో చాలా వరకు దాతృత్వ కార్యక్రమాల కోసం వెచ్చించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
3,4,5 స్థానాల్లో హిందూజా బ్రదర్స్, పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ, ఉదయ్ కోటక్ ఉన్నారు. ఉదయ్కోటక్ టాప్ 5లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి.