జమ్ముకశ్మీర్‌లో తొలిసారి రాజ్యాంగ దినోత్సవం జమ్ముకశ్మీర్‌లోనూ ఇవాళ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఇక్కడ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నారు.
"రాజ్యాంగం రూపొందించినవారిని మనం కృతజ్ఞతలు తెలిపి స్మరించుకోవాలి. అందులో పొందుపరిచిన ఉన్నత విలువలు, సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ సంవత్సరంతో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు పూర్తవుతుంది. "
-సుబాష్ సి చిబ్బర్, అదనపు కార్యదర్శి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, జమ్ముకశ్మీర్
'ముందుమాట'తో ప్రారంభం..
ఇవాళ ముందుగా అన్ని ప్రభుత్వ సంస్థలు ఉదయం 11 గంటలకు రాజ్యాంగ ముందుమాట(ప్రవేశిక)ను చదివి, తమ ప్రాథమిక హక్కులను సమర్థంగా నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. డివిజనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొంటారు.
ప్రాథమిక హక్కులపై అవగాహన...
ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పించేందుకు.. మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వరకు ఈ డ్రైవ్‌ను కొనసాగిస్తామని వెల్లడించారు.
1949లో నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఆ తర్వాత 1950 జనవరి 26వ తేదీ ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
ఇదీ చూడండి : రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ కృషి అనన్య సామాన్యం