తమిళనాడులో ఓ ట్రాన్స్‌జెండర్ ప్రభుత్వ నర్స్‌గా ఉద్యోగం సంపాదించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా పేరు పొందింది అన్బూ రూబీ.
ఎన్నో ఒడుదొడుకలను ఎదుర్కొని.. ఇంటర్మీడియట్ తరువాత నర్సింగ్ పూర్తి చేసింది అన్బూ. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేసింది. తరువాత పోటీపరీక్షల్లో ప్రతిభ చాటింది. తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి, ఆరోగ్యమంత్రి సీ విజయభాస్కర్ ఆమె ప్రతిభను గుర్తించి స్వయంగా తమ సంతకాలతో ఉద్యోగం ఖరారైనట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది అన్బూ. ట్రాన్స్జెండర్లను సమాజం నుంచి వేరుగా చూడొద్దని, తమను ప్రోత్సహిస్తే ఏదైన సాధిస్తామని చెబుతోంది అన్బూ..
"నేను ఈ ఉద్యోగం సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తొలి ప్రభుత్వ ట్రాన్స్‌జెండర్ నర్స్‌గా గుర్తింపు పొందాను. ఇందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నేను ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినదానిని. మా నాన్న అంధుడు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది."
-అన్బూ రూబీ, ట్రాన్స్‌జెండర్ నర్స్