ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై క్రికెట్ పదజాలంతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై ట్విట్టర్లో తనదైన శైలిలో స్పందించారు ప్రియాంక. క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలంటూ.... ఓ మ్యాచ్లో ఆటగాడు కష్టమైన క్యాచ్ అందుకుంటున్న దృశ్యాలను పోస్ట్ చేశారు ప్రియాంక.
" క్రికెట్లో క్యాచ్ అందుకోవాలంటే బంతిపైనే దృష్టి ఉంచుతూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలి. లేకపోతే ఓలా, ఉబర్, గణితాన్ని నిందించాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ఈ విషయాన్ని చెబుతున్నా."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.