తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వైరస్​పై గెలుపు తథ్యం- కరోనా యోధుల సేవలు భేష్'

'సేవా పరమో ధర్మ' అనే మంత్రానికి కట్టుబడి దేశ ప్రజలకు సేవ చేస్తున్న కరోనా యోధులను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల సంకల్పంతో దేశం త్వరలోనే కరోనాను జయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

for modi speech
మోదీ

By

Published : Aug 15, 2020, 7:59 AM IST

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం పోరాడుతున్న ప్రతీ ఒక్కరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిస్వార్థ సేవ చేస్తున్న కరోనా యోధులను గుర్తు చేసుకోవాలని ఎర్రకోట వేదికగా చేసిన ప్రసంగంలో సూచించారు.

'సేవా పరమో ధర్మ' అనే మంత్రానికి కట్టుబడి దేశ ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు మోదీ. వారికి కృతజ్ఞతలు తెలిపారు.

"ప్రస్తుతం దేశం విభిన్న పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈరోజు నా ముందు చిన్న పిల్లలు కనిపించడం లేదు. కరోనా అందరి జీవితాలను స్తంభింపచేసింది. ఈ సమయంలో 'సేవా పరమో ధర్మ'తో కరోనా యోధులు భారత ప్రజలకు సేవ చేస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

దేశ ప్రజల సంకల్పంతో భారత్​ త్వరలోనే కరోనాను జయిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details