కరోనా విజృంభణతో పాఠశాలలు మూతపడ్డాయి. ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ పాఠాలు ప్రారంభించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్లకు ఆమడ దూరంలో ఉన్నారు. అయితే వారిలా తన కూతురు కాకూడదని ఓ పేద దేవదాసి తల్లి.. చెవిపోగులు అమ్మి మరీ స్మార్ట్ఫోన్ కొనిచ్చింది.
ఇదీ అసలు కథ!
కర్ణాటక బెళగావి జిల్లా అంకలగి గ్రామానికి చెందిన సరోజిని బెవినకట్టి.. బెళగావి నగరంలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. సరోజిని కుమార్తె రేణుకా పదో తరగతి చదువుతోంది. కుమారుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం. ఓ ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు.