తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో తొలిసారి మహిళా వైద్యుల సేవలు - మహిళా వైద్యులు

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు ఐటీబీపీ కీలక నిర్ణయం తీసుకంది. లద్దాఖ్​లోని ఫార్వర్డ్​ లొకేషన్లకు తొలిసారిగా మహిళా వైద్యులను పంపించింది. ఇందుకోసం నిబంధనల్లో మార్పులు కూడా చేసింది. జవాన్లకు వైద్య సేవలు అందించే బాధ్యతలను ఈ మహిళా డాక్టర్లు చేపట్టారు.

For first time, ITBP deploys female doctors at forward locations in Ladakh
సరిహద్దులో తొలిసారిగా మహిళా వైద్యుల సేవలు

By

Published : Sep 8, 2020, 3:16 PM IST

Updated : Sep 8, 2020, 3:38 PM IST

లద్దాఖ్​లోని సైనిక శిబిరాల(ఫార్వర్డ్​ లొకేషన్స్​)కు తొలిసారిగా మహిళా వైద్యులను పంపించింది ఇండో-టిబెటన్​ బోర్డర్ పోలీస్​(ఐటీబీపీ). లేహ్​ నుంచి వచ్చే దళాలకు వైద్య సేవలు అందించడం వంటి పనులు ఈ వైద్యులు చేస్తున్నారు.

సరిహద్దులో తొలిసారి మహిళా వైద్యుల సేవలు
సరిహద్దులో తొలిసారిగా మహిళా వైద్యుల సేవలు

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తన ఎస్​ఓపీ(స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసీజర్​)లో మార్పులు చేసింది ఐటీబీపీ. ఫలితంగా ఇప్పటివరకు ఫార్వర్డ్​ లొకేషన్లలో సేవలు చేయని మహిళా వైద్యులకు మార్గం సుగమం అయ్యింది.

ఐటీబీపీ ప్రకారం.. సరిహద్దు ప్రాంతాల వద్ద మహిళాధికారులను కూడా మోహరించారు. దళాల వైద్య సేవలకు సంబంధించిన అవసరాలను ఈ మహిళా డాక్టర్లు చూసుకుంటారు. వివిధ వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్న పారామెడికోలకు సహాయం చేసేందుకు కూడా వీరిని పంపారు. నర్సులు, మందులను అందించేవారిని కూడా భారీ స్థాయిలో సరిహద్దు ప్రాంతాలకు తరలించారు.

భౌతిక దూరం పాటిస్తూ
శరీర ఉష్ణోగ్రత పరిశీలిస్తున్న సిబ్బంది

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లేహ్​ సైనిక స్థావరానికి చేరుతున్నారు సైనికులు. వీరికి కఠినమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిని పర్యవేక్షించడానికి ఓ మహిళా అధికారికి బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో.. అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. క్వారంటైన్​ కాలాన్ని పూర్తి చేసుకున్న జవాన్లు ఇక్కడకు వచ్చి.. నాలుగు దశల్లో జరిగే పరీక్షలు చేయించుకుని.. సంబంధిత క్లియరెన్స్​ పత్రాలను పొందితేనే.. విధి నిర్వహణకు అనుమతిస్తున్నారు. ఈ పూర్తి ప్రక్రియను కూడా మహిళా అధికారులే పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి:-దటీజ్ ఇండియన్ ఆర్మీ... మానవత్వంలోనూ భేష్

Last Updated : Sep 8, 2020, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details