కరోనా వ్యతిరేక పోరులో భాగంగా వ్యాప్తి రేటు తగ్గించి, మార్గదర్శకాలకు లోబడి ప్రజా కార్యకలాపాలు జరిగేలా చేయడమే ప్రస్తుతం దృష్టిసారించాల్సిన అంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రుల సూచనలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌కి సంబంధించి... ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించింది. రైల్వే సర్వీసులను పునఃప్రారంభించడం సైతం ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకేనని మోదీ అభిప్రాయపడ్డట్లు అందులో పేర్కొంది. అన్ని రూట్లలో సర్వీసులకు ఇప్పుడే అనుమతించేది లేదని మోదీ స్పష్టం చేసినట్లు తెలిపింది.