పాము జాతుల్లో ఎగిరే సర్పాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలా ఎగిరే పాము కర్ణాటక- మైసూర్‌లోని ఓ ఇంట్లో దర్శనమిచ్చింది. దట్టమైన అడవుల్లో చాలా అరుదుగా కనిపించే ఈ పాము.. ఓ వ్యక్తి నివాసంలో ప్రత్యక్షమవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సుమారు నాలుగు అడుగుల పొడవున్న ఈ సర్పంపై.. భయం కల్పించే రీతిలో నలుపు, పసుపు రంగు చారలున్నాయి.
తన ఇంట్లో పామును చూసి భయపడిన వెంకటరాము.. తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. సర్పాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది దొరకకుండా గాల్లోకి ఎగిరి పారిపోయినట్లు అధికారులు తెలిపారు.