తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: 'మహా' బలపరీక్షలో ఉద్ధవ్​ ప్రభుత్వం విజయం - మహారాష్ట్ర బలపరీక్

FLOOR TEST TO BE HELD IN MAHARASTRA ASEEMBLY TODAY
ఉద్ధవ్​ సర్కార్​కు బలపరీక్ష.. గెలుపు లాంఛనమే..!

By

Published : Nov 30, 2019, 12:25 PM IST

Updated : Nov 30, 2019, 3:40 PM IST

15:27 November 30

బల పరీక్షలో 'మహా వికాస్​ అఘాడీ' గెలుపు

'మహా' బల పరీక్షలో 'మహా వికాస్​ అఘాడీ' నెగ్గడం లాంఛనమేనని ముందు నుంచి ఊహించినట్లుగానే జరిగింది. ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలోని సర్కారుకు మద్దతుగా 169 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.
బల పరీక్ష తీర్మానాన్ని కాంగ్రెస్​ నేత అశోక్​ చవాన్​ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వాన్ని శివసేన నేత సునీల్​ ప్రభు, ఎన్సీపీ నేత నవాబ్​ మాలిక్​ బలపరిచారు. ప్రొటెం స్పీకర్​ దిలిప్​ వాల్సే పాటిల్​ ఓటింగ్​ నిర్వహించారు. సర్కారుకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను లెక్కించారు స్పీకర్​. అనంతరం పరీక్షలో సర్కారు నెగ్గినట్లు ప్రకటించారు​. నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నట్లు తెలిపారు.
భాజపా సభ్యులు లేకుండానే మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించారు.

భాజపా వాకౌట్​..

బల పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టిన క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.  సభ నుంచి ఫడణవీస్​తో పాటు భాజపా సభ్యులు వాకౌట్​ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి సభ నిర్వహిస్తున్నారని.. వందేమాతరం పాడకుండానే సభ ప్రారంభించడమేంటని ప్రశ్నించారు ఫడణవీస్​. ఎన్సీపీ నేత దిలీప్​ వాల్సేను ప్రొటెం స్పీకర్​గా ఎన్నుకోవటాన్ని తప్పుపట్టారు భాజపా నేత.

14:53 November 30

మహారాష్ట్ర: బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం

  • బలపరీక్షకు ముందు సభ నుంచి వాకౌట్‌ చేసిన భాజపా
  • భాజపా సభ్యులు లేకుండానే మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష
  • నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ సభ నుంచి భాజపా వాకౌట్‌
  • బలపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ సభ్యుడు అశోక్‌ చవాన్‌
  • బలపరిచిన శివసేన నేత సునీల్‌ ప్రభు, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌
  • సర్కారుకు మద్దతుగా నిలిచిన సభ్యులను లెక్కించిన అసెంబ్లీ అధికారులు
  • ప్రభుత్వానికి మద్ధతుగా 169 ఓట్లు

14:39 November 30

విపక్షాల వాక్​ఔట్​...

మహారాష్ట్ర శాసనసభ వాడీవేడిగా సాగుతోంది. కాంగ్రెస్​ సీనియర్​ నేత అశోక్​ చవాన్​ విశ్వాస పరీక్షను తీర్మాణించగా.. కాంగ్రెస్​-ఎన్​సీపీ నేతలు మద్దతిచ్చారు. కానీ.. ప్రత్యేక శాసనసభ సమావేశం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని ఆరోపిస్తూ... విపక్ష నేతలు సభ నుంచి వాక్​ఔట్​ చేశారు.

14:19 November 30

సభ ప్రారంభంలోనే....

శాసనసభ ప్రారంభంలోనే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్..​ ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు చెలరేగారు. అసలు శాసనసభ సమావేశం నిబంధనలతో జరగడం లేదని ఆరోపించారు. సమావేశంలో ఎన్నో నియమాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.

ఫడణవీస్​ ఆరోపణలను తోసిపుచ్చారు ప్రొటేం స్పీకర్​ దిలీప్​ పాటిల్​. గవర్నర్​ అంగీకారంతోనే శాసనసభ సమావేశం జరుగుతోందని... ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.

అనంతరం ఫడణవీస్​కు మద్దతుగా భాజపా ఎమ్మెల్యేలు భారీ నినాదాలు చేశారు.

14:09 November 30

శాసనసభ ప్రారంభం...

మహారాష్ట్ర శాసనసభ ప్రారంభమైంది. ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం.. మరికాసేపట్లో బల పరీక్షను ఎదుర్కోనుంది.

13:08 November 30

ఎమ్మెల్యేలకు విప్​ జారీ చేసిన కాంగ్రెస్​

ప్రభుత్వ బల పరీక్ష నేపథ్యంలో శాసనసభకు తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎమ్మెల్యేలను ఆదేశిస్తూ.. విప్​ జారీ చేసింది కాంగ్రెస్​. నేడు మధ్యాహ్నం రెండు గంటలకు బల పరీక్ష జరగనుంది.

13:03 November 30

ఛత్రపతి శివాజీ మహారాజ్​ విగ్రహం వద్ద ఉద్ధవ్​ నివాళి

'మాహా వికాస్​ అఘాడీ' ప్రభుత్వ బల పరీక్ష నేపథ్యంలో శాసనసభకు చేరుకున్నారు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. అసెంబ్లీ ప్రాంగణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్​ విగ్రహం వద్ద నివాళులర్పించారు.

12:43 November 30

శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలకు విప్​ జారీ

నేడు మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే బల పరీక్ష నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలకు విప్​ జారీ చేశాయి శివసేన, ఎన్సీపీ పార్టీలు. బల పరీక్షలో నెగ్గేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ ఉన్నట్లు పేర్కొన్నాయి.
మహా వికాస్​ అఘాడి కూటమి నేతలు శాసనసభకు చేరుకుంటున్నారు. ఎన్సీపీ అధినేత శరత్​ పవార్​ కుమార్తే సుప్రియా సూలే అసెంబ్లీకి చేరుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​తో పాటు భాజపా ఎమ్మెల్యేలు ఇప్పటికే శాసనసభ వద్దకు వచ్చారు.

12:28 November 30

స్పీకర్​ పదవికీ పోటాపోటీ

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన వేళ.. స్పీకర్‌ పదవికి పోటీ అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.  అధికార కూటమి తమ అభ్యర్థి పేరును ప్రకటించింది. భాజపా కూడా బరిలో ఉంటామని సంకేతాలిచ్చింది.

శివసేన- కాంగ్రెస్-ఎన్సీపీ మహా వికాస్ అఘాడి కూటమి  స్పీకర్ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత  నానా పటోల్‌ స్పీకర్​ను బరిలో దింపింది. ఈ మేరకు పటోల్​ నామినేషన్​ వేశారు.

భాజపా కూడా స్పీకర్ అభ్యర్థిని ప్రకటించింది. కిసాన్ కాథోర్​ పేరును భాజపా స్పీకర్ అభ్యర్థిగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. 

 

12:13 November 30

ఉద్ధవ్​ సర్కార్​కు బలపరీక్ష.. గెలుపు లాంఛనమే..!

మహారాష్ట్ర అసెంబ్లీ నేటి నుంచి రెండు రోజుల పాటు సమావేశం కానుంది. 'మహా వికాస్​ అఘాడీ' కూటమి నేతృత్వంలో ఏర్పడిన ఉద్ధవ్​ సర్కార్​.. ఇవాళ బల పరీక్ష ఎదుర్కోనుంది. అంతకుముందే నూతన మంత్రులను సభకు పరిచయం చేస్తారు.

రెండో రోజు శాసనసభ సభాపతి​ని ఎన్నుకుంటారు. తర్వాత.. గవర్నర్​ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేస్తారు. కొత్తగా నియమితులైన స్పీకర్​... అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పేరును ప్రకటిస్తారు.

Last Updated : Nov 30, 2019, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details