వర్షాకాలం నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ అప్రమత్తమైంది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో వరదల వంటి విపత్తు పరిస్థితుల్లో సహాయక చర్యలు, ప్రజలు, సామగ్రిని శానిటైజ్ చేయడం కోసం 90కి పైగా బృందాలను దేశవ్యాప్తంగా మోహరించింది.
వర్షాకాలం నేపథ్యంలో వరదల సన్నద్ధతపై ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా 90 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ ఎన్ ప్రధాన్.
ఒక్కో బృందంలో 45 మంది సభ్యులు ఉంటారు. బోట్లు, ఇతర పరికరాలతో సహాయం చేయడానికి ఈ బృందాలు సన్నద్ధంగా ఉంటాయి.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రత్యేక వ్యూహాలతో సన్నద్ధమవుతున్నట్టు ప్రధాన్ తెలిపారు.