రాజస్థాన్లో వరుణుడి బీభత్సం కొనసాగుతుంది. శుక్రవారం భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. శుక్రవారం ఐదుగురు మృతి చెందారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా కొన్ని ప్రాంతాలను వరద ప్రవాహం వీడట్లేదు.
సీకర్ జిల్లా కేంద్రంలో వందలాది ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.