తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరద బీభత్సం - జనజీవనం అస్తవ్యస్తం

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల వల్ల నదులు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలన్నీజలమయమయ్యాయి. గుజరాత్​, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో జన జీవనం స్తంభించిపోయింది. విపత్తు నిర్వహణ ప్రతిస్పందన దళాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

floods due to heavyr rainfall several states in India
దేశంలో వరద బీభత్సం - సర్వేల్లో సీఎంలు

By

Published : Aug 31, 2020, 9:09 PM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఫలితంగా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద నీరు ఇళ్లల్లో ప్రవేశించడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎన్​డీఆర్​ఎఫ్​ దళాలు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

వేలాది ఎకరాల్లో నీటమునిగిన పంట
భారీ వరద వల్ల కూలిన వంతెన
నడుంలోతు వరద నీటిలో ముగజీవాలను కాపాడుతున్న యువకులు

చెరువును తలపిస్తున్న రహదారులు

భారీ వర్షాలు గుజరాత్​ను వణికిస్తున్నాయి. వీధులనీ జలమయమయ్యాయి. సర్దార్​ సరోవర్​ డ్యామ్​ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల భరుచ్​ ప్రాంతం నీటమునిగింది.

వరద ధాటికి కూలిన వంతెన

మహారాష్ట్రలో వరద బీభత్సం...

మహారాష్ట్రలో వరదల కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి ఎన్​డీఆర్​ఎఫ్​ దళాలు. నాగ్​పుర్​లోని కొన్ని గ్రామాల్లో ఇరుక్కుపోయిన 39 మందిని రక్షించారు.

వరద బాధితులను రక్షిస్తున్న సైన్యం
వరద బాధితులను కాపాడుతున్న ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం

మహానది ఉగ్రరూపం..

ఒడిశాలో మహానది ఉగ్రరూపం దాల్చడం వల్ల వరద నీరు జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించింది. ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించి... నిలువ నీడలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే 17మంది ప్రాణాలు కోల్పోయారు. 20 జిల్లాల్లో 14 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. సీఎం నవీన్​ పట్నాయక్​ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్​ సర్వే నిర్వహించారు.

ఏరియల్​ సర్వే నిర్వహిస్తోన్న ఒడిశా సీఎం

సహాయక చర్యల్లో సీఎం...

మధ్యప్రదేశ్​లోని వరద ప్రభావిత ప్రాంతం హోషంగాబాద్​లోని ప్రజలను కలిశారు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​. వారికి ఆహార పొట్లాలు అందజేశారు. ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుదని భరోసా ఇచ్చారు.

ఆహార పొట్లాలు అందజేస్తున్న మధ్యప్రదేశ్​ సీఎం
పునరావాస కేంద్రంలో వరద బాధితులు

ఇదీ చూడండి:అన్ని పదవులు అలంకరించినా ఆ ఒక్కటి అందలేదు!

ABOUT THE AUTHOR

...view details