తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరాదిలో వరదల బీభత్సం..పలు ప్రాంతాలు జలదిగ్బంధం - దళాలు

ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్​ను వరదలు ముంచెత్తాయి. నీట మునిగిన ప్రాంతాల నుంచి దాదాపు 45వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజస్థాన్​లో డ్యామ్​లు తెరవడం వల్ల చాలా ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.

ఉత్తరాదిలో వరదల బీభత్సం..పలు ప్రాంతాలు జలదిగ్బంధం

By

Published : Sep 16, 2019, 5:09 AM IST

Updated : Sep 30, 2019, 6:52 PM IST

ఉత్తరాది రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్​లో భారీ వర్షాలకు పలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఆదివారం దాదాపు 45వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 150 పునరావాస కేంద్రాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా మందసౌర్​, నీమచ్​ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రాజస్థాన్​లో పలు ప్రాంతాలు జలమయం

వరద నీటి ఉద్ధృతితో రాజస్థాన్​లోని పలు జిల్లాల్లో ఆనకట్టల గేట్లు ఎత్తివేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. చిత్తోర్​గఢ్​, కోటలో వందాలాది ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు ఇంటిపై కప్పుపై తలదాచుకున్నారు. మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.

పాఠశాలలో చిక్కుకున్న 300మంది విద్యార్థులు

చిత్తోర్​గఢ్​ జిల్లా రావత్​భాటా పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల భవనంలో 300మందికి పైగా విద్యార్థులు, 25మంది ఉపాధ్యాయులు చిక్కుకున్నారు. వరదల కారణంగా ఆ ప్రాంతమంతా జలదిగ్బంధం అయినందు వల్ల వారు బయటికి రాలేక పోతున్నారు. వాళ్లందరికీ ఆహార, నీటి సరఫరా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:దైవంగా భావించే శ్వేతనాగుని చూస్తారా?

Last Updated : Sep 30, 2019, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details