తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉప్పొంగిన 'మహానది'- ఒడిశా జలమయం! - undefined

ఒడిశాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బౌధ్​, ఖోర్ధా, బర్గాడ్​, ఝుర్సుగుడా జిల్లాల్లో కురుస్తోన్న వానలతో.. హిరాకుడ్​ డ్యాం 46 గేట్లు ఎత్తారు. మహానది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఒడిశా విపత్తు స్పందన దళం.

Flood Situation Remains Grim In Odisha
ఉప్పొంగిన 'మహానది'..జలమయమైన ఒడిశా

By

Published : Aug 30, 2020, 4:46 PM IST

భారీ వర్షాలు, వరదలతో ఒడిశా గజగజ వణుకిపోతోంది. నదులు, వాగులు ఉప్పొంగి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఒడిశా విపత్తు రాపిడ్​ యాక్షన్​ ఫోర్స్( ఓడీఆర్​ఏఎఫ్​)​ సిబ్బంది.. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న ఓడీఆర్​ఏఎఫ్​ సిబ్బంది

" కటక్​కు చెందిన ఓడీఆర్ఏఎఫ్​ సిబ్బంది.. పంగట గ్రామంలో ఇద్దరు, తకుర్​పుర్​ గ్రామంలో నలుగురు వరదల్లో చిక్కుకుని ఇంటి పైకప్పుపై ఉండగా.. వారిని రక్షించారు. అలాగే తకుర్​పన్నా గ్రామానికి చెందిన పక్షవాత రోగిని కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. బంకసాహిలో వరదల్లో చిక్కుకున్న 10 మందిని కాపాడి.. కథూరి శిబిరానికి తరలించారు."

- ఒడిశా పోలీసులు

ఉప్పొంగిన మహానది..

హిరాకుడ్​ డ్యాం 46 గేట్లు ఎత్తిన నేపథ్యంలో మహానది ఉగ్రరూపం దాల్చింది. కటక్​లోని ముందులి బ్యారేజీ నిండుకుండలా మారింది. బౌధ్​, ఖోర్ధా, బర్గాఢ్​, ఝర్సుగుడా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కృష్ణ మొహనపుర్​ సమీపంలోని జగన్నాథ రోడ్డు వంతెనపై ఎనిమిది అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. బౌధ్​ నగరంలో వరద నీరు సెంట్రల్​ స్కూల్​, హాస్టళ్లలోకి చేరింది. సుమారు 500 మందిని ఆరు శిబిరాలకు తరలించారు అధికారులు.

మహానది ఉగ్రరూపం
చెరువును తలపిస్తున్న దారులు
వరద నీటిలో ఆలయం
ఉప్పొంగి ప్రవహిస్తున్న మహానది
నిండుకుండలా ముందులి బ్యారేజీ

ఇదీ చూడండి:మధ్యప్రదేశ్​ను ముంచెత్తిన వరదలు.. ఒకరు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details