తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరద ఉద్ధృతి తగ్గుముఖం- కుదుటపడుతున్న అసోం - ASSAM FLOOD SITUATIONS

వరదలతో అతలాకుతలమైన అసోంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మణిక్‌పుర్ ప్రాంతంలో ఒకరు నిటమునగగా.. ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 136 మంది ప్రాణాలు కోల్పోయారు.

assam
అసోం

By

Published : Aug 4, 2020, 9:51 AM IST

అసోంలో వరద ఉద్ధృతి తగ్గటం వల్ల పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు జిల్లాలు విముక్తం కాగా... 4.65 లక్షల మందికి ఉపశమనం లభించింది.

వరద ఉద్ధృతి తగ్గుముఖం- కుదుటపడుతోన్న అసోం

అయినప్పటికీ 17 జిల్లాల్లో 3.89 లక్షల మంది ప్రజలు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 494 గ్రామాలు, 32 వేల హెక్టార్ల భూమి జలదిగ్బంధంలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.

అసోం వరదలు

ప్రవాహ ఉద్ధృతి

డుబిడీ, నిమతిఘాట్​, తేజ్​పుర్​లో బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దాని ఉపనదులు ధన్​సిరి, జియా భరాలి, కొపిలి కూడా ఉద్ధృతిని మించి ప్రవహిస్తున్నాయి. మణిక్​పుర్​లో శనివారం వరద నీటిలో పడి మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

పునరావాస కేంద్రాల్లో..

రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 39 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది అసోం ప్రభుత్వం. వీటిల్లో 7,181 మంది ఆశ్రయం పొందుతున్నారు. చిరాంగ్, బార్​పేట, కోక్రాఝర్​ జిల్లాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.

ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో అసోం అతలాకుతలమైంది. వరదలు, కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా 136 మంది మరణించారు. వరదల్లో 110 మంది మృత్యువాత పడగా.. కొండచరియల ప్రమాదాల్లో 26 మంది ప్రాణాలు విడిచారు.

ABOUT THE AUTHOR

...view details