తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు సార్లు ప్రయత్నించినా.. ప్రమాదం తప్పలేదు

ప్రమాదానికి ముందు ఎయిరిండియా విమానాన్ని పైలట్ కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడానికి కనీసం రెండుసార్లు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఫ్లైట్ ట్రాకర్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన మ్యాప్‌ ద్వారా ఈ విషయం వెల్లడవుతోంది.

flight tracker
ఫ్లైట్‌ట్రాకర్

By

Published : Aug 8, 2020, 3:08 PM IST

కోజికోడ్​లో విమాన ప్రమాదానికి ముందు సురక్షితంగా ల్యాండ్ చేయటానికి పైలట్ రెండు సార్లు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. స్వీడన్‌కు చెందిన ఫ్లైట్‌ట్రాకర్ 24 అనే సంస్థ కమర్షియల్ విమానాలకు సంబంధించి ట్రాకింగ్ సమాచారాన్నంతా ఒక మ్యాప్‌ రూపంలో అందిస్తుంది. వైబ్​సైట్​ డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది.

ఫ్లైట్‌ట్రాకర్

శుక్రవారం దుబాయ్‌ నుంచి కోజికోడ్‌ వరకు బోయింగ్ 737ఎన్‌జీ విమాన ప్రయాణం సక్రమంగానే సాగింది. కోజికోడ్ విమానాశ్రయంలోని టేబుల్ టాప్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత రన్‌వే మీద నుంచి జారీ లోయలోకి పడిపోయింది.

అయితే ఈ ప్రమాదానికి ముందు విమానాన్ని సురక్షితంగా దింపడానికి పైలట్ రెండు సార్లు ప్రయత్నించినట్లు ఆ మ్యాప్‌ వెల్లడిచేస్తోంది. పైలట్ అంతగా ప్రయత్నించినా.. ప్రమాదం మాత్రం తప్పలేదు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి:విమాన ప్రమాద ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details