ఈనెల 15 లేదా 17 నుంచి విమానాలు నడిపే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ప్రయాణికులు, విమానయాన సంస్థలు, విమానాశ్రయ ఆపరేటర్ల కోసం ప్రామాణిక నిబంధనలను పౌర విమానయాన సంస్థ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
విమాన సేవల పునరుద్ధరణపై బుధవారం ప్రకటన! - విమాన సేవల పునరుద్ధరణ
దేశంలో విమాన సేవల పునరుద్ధరణపై పౌరవిమానయాన శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నెల 15 లేదా 17 నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు బుధవారం సాయంత్రంలోపు అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.
![విమాన సేవల పునరుద్ధరణపై బుధవారం ప్రకటన! FLIGHT SERVICES TO REOPEN FROM 15 OR 17TH MAY!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7169432-464-7169432-1589289891792.jpg)
విమాన సేవల పునరుద్ధరణపై రేపు అధికారిక ప్రకటన!
ఈ విషయంపై బుధవారం సాయంత్రంలోపు అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఎయిర్‌పోర్ట్ అథారిటీ, డిజీసీఏ, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా చర్చలు జరిపి.. నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది.
లాక్డౌన్ ఎత్తివేత అనంతరం విమాన సేవలకు సంబంధించిన విధివిధాలనాలపై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది పౌర విమానయాన శాఖ.