కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి పెనుప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్ విమానాశ్రయంలో ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే గుర్తించిన పైలట్ టేకాఫ్‌ను నిలిపివేశాడు.
టేకాఫ్‌లో సాంకేతిక లోపం- గడ్కరీకి తప్పిన ముప్పు - నాగ్‌పూర్- దిల్లీ
టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం సంభవించి నాగ్‌పుర్- దిల్లీ విమానం నిలిచిపోయింది. ఈ ఘటన నాగ్‌పుర్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం జరిగింది. విమానంలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు.
టేకాఫ్‌లో సాంకేతిక లోపం- గడ్కరీకి తప్పిన ముప్పు
ఈ రోజు ఉదయం ఇండిగో 6ఈ-636లో గడ్కరీ నాగ్‌పుర్ నుంచి దిల్లీకి వెళ్లాల్సి ఉంది. విమానంలో కేంద్ర మంత్రి ఉన్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు ధ్రువీకరించాయి.
ఇదీ చూడండి:- సిరిమల్లె పువ్వా.. చిరకాలం గుర్తుండిపోవా..!
Last Updated : Sep 26, 2019, 8:29 PM IST