దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్ పోర్బందర్లోని స్థానికులంతా కలిసి వినూత్నంగా జెండాను ఆవిష్కరించారు. సముద్రం మధ్యలో మువ్వన్నెల జెండావందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు.
సముద్రపు ఒడ్డు నుంచి కొంత దూరం లోపలికి పోయిన స్థానిక ఈతగాళ్లు.. వాతావరణ పరిస్థితిని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను గత 20 ఏళ్లుగా ఇలాగే జరుపుకుంటున్నారు ఇక్కడివారు.
"మేం గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవడానికి ఇక్కడ కలిశాం. దేశ ప్రజలందరూ కేవలం భూభాగంపై మాత్రమే జెండాను ఎగురవేస్తారు. కానీ మేము మాత్రం సముద్రం మధ్యలో ఆవిష్కరిస్తాము. ఎలాంటి వాతవరణ పరిస్థితి ఎదురైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం."