తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్​పథ్​లో మువ్వన్నెల జెండా రెపరెపలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ వీధుల్లో దేశభక్తి నినాదాలు మారుమోగుతున్నాయి. ముఖ్యంగా రాజ్​పథ్​ మార్గంలో జెండా వందనం కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు తరలివెళ్లారు. రాష్ట్రపతి కోవింద్​, ప్రధాని మోదీ, బ్రెజిల్​ అధ్యక్షుడు బోల్సొనారోతో పాటు దేశంలోని అగ్రనేతలు ఇందులో పాల్గొన్నారు.

FLAG HOISTING PROGRAM IN DELHI'SRAJPATH
గణతంత్ర వేడుకలు: త్రివర్ణ జెండాకు సెల్యూట్​

By

Published : Jan 26, 2020, 10:36 AM IST

Updated : Feb 18, 2020, 10:56 AM IST

రాజ్​పథ్​లో మువ్వన్నెల జెండా రెపరెపలు

దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రాజపథ్​లో జాతీయ జెండా ఆవిష్కరించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వివిధ పార్టీల అగ్రనేతలు పాల్గొన్నారు.

71వ గణతంత్ర దినోత్సవానికి బ్రెజిల్​ అధ్యక్షుడు జాయిర్​ బోల్సొనారో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వందలాది మంది రాజ్​పథ్​కు తరలి రాగా... ఆ ప్రాంతమంతా ఆహ్లాద వాతావరణం నెలకొంది.

రాజ్​పథ్​కు వెళ్లే ముందు ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. అమర వీరులకు నివాళులర్పించారు.

ఇదీ చూడండి:- అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్​ రిట్రీట్'​ వేడుకలు

Last Updated : Feb 18, 2020, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details