కర్ణాటకలో భారీ వర్షాలకు బాగల్కోట్ జిల్లా జమాఖండి తాలూకాలోని షుర్పాలి గ్రామం జలదిగ్బంధమైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామస్థులు కొంతమంది ఎలాగైనా తమ ఊరిలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని సంకల్పించారు. పడవలు వేసుకుని వెళ్లి మరీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. దేశభక్తిని ఎలుగెత్తి చాటారు.
వరదలైనా మువ్వన్నెల జెండా ఎగరాల్సిందే!
కర్ణాటకలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో షుర్పాలి గ్రామం ఒకటి. అయినా... ఆ ఊరి ప్రజలు స్వాతంత్ర్య దినం నాడు త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని సంకల్పించారు. అనుకున్నది చేసి చూపించి... ఔరా అనిపించారు.
వరదలైనా మువ్వన్నెల జెండా ఎగరాల్సిందే!